ఏటీసీల ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు : వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ఎస్.రాజా

 ఏటీసీల ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు : వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ఎస్.రాజా

మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీల ద్వారా యువతకు సాంకేతిక శిక్షణ అందిస్తూ ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని వరంగల్​రీజినల్ ​డిప్యూటీ డైరెక్టర్​ఎస్.రాజా అన్నారు. ఇంజినీరింగ్ పట్టభద్రుల కంటే ఐటీఐ-ఏటీసీ విద్యార్థులకు అనేక బహుళజాతి సంస్థల్లో వేగంగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. ఇటీవల ఉట్నూర్​ఏటీసీకి చెందిన 99 మంది విద్యార్థులు ప్రముఖ ఎంఎన్‌‌‌‌సీల్లో ఉద్యోగాలు పొందారని చెప్పారు.

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రవేశపెట్టిన ‘మల్టీ స్కిల్ లెర్నింగ్’ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు మంగళవారం మంచిర్యాల ఐటీఐ-ఏటీసీలో  నిర్వహించిన సర్టిఫికెట్ల ప్రదానోత్సవానికి ఆయన చీఫ్ ​గెస్ట్​గా హాజరై మాట్లాడారు. రెండు వారాల వ్యవధిలో 850 మంది విద్యార్థులకు  ఆరు బేసిక్ అడ్వాన్స్డ్ స్కిల్ కోర్సులను అందించామన్నారు. కార్యక్రమంలో ఐటీఐ- ఏటీసీ జిల్లా కన్వీనర్​ పి.వెంకటేశ్వర్​రావు, ఐటీఐల ప్రిన్సిపాళ్లు దేవానంద్, టి.సుజాత, పి.శ్రీనివాస్, రొడ్డ శ్రీనివాస్, పి.శేఖర్, వై.రమేశ్​ పాల్గొన్నారు.